Friday, January 3, 2025

40 మంది భార్యలకు భర్త ఒక్కడే కానీ…

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఒక్క మగాడికి ఒక భార్య లేక ఇద్దరు భార్యలు ఉంటారు… కానీ ఇతగాడికి మాత్రం 40 మంది భార్యలు ఉన్నట్టు జనాభా రికార్డులోకెక్కనున్నాడు. అసలు విషయానికొస్తే… బిహార్ రాష్ట్రం ఆర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ప్రాంతానికి కులగణన కోసం అధికారులు వెళ్లారు. అక్కడ ఉన్న వేశ్యాలను భర్త, పిల్లల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మహిళలు అందరూ తన భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారు. అక్కడ ఉన్న పిల్లలు అడగగా తన తండ్రి పేర్ రూప్ చంద్ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. రూప్‌చంద్ ఎవరా? అని ఆరా తీయగా స్థానికంగా ఉంటూ పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు వివరణ ఇచ్చారు. అతడిపై అభిమానంతో అందరూ తన భర్తగా పేరు చెప్పినట్లుగా తెలుస్తుంది. వేశ్యాలు ఎవరు కూడా తన  కులం గురించి మాత్రం చెప్పటం లేదు.

Also Read: 15 రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో కాబోయే వరుడు, వధువు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News