Saturday, November 23, 2024

షీషటిల్‌ను ప్రారంభించిన మాదాపూర్ డిసిపి

- Advertisement -
- Advertisement -

సైబరాబాద్‌లో 18వ బస్సు

హైదరాబాద్: మహిళా ఉద్యోగుల కోసం షీషటిల్స్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి అన్నారు. ఎడిపి సంస్థ ఏర్పాటు చేసిన బస్సును మాదాపూర్ డిసిపి శిల్పవల్లి సంస్థ ప్రతినిధులు విజయ్ మేములపల్లి, కవాన్, ఎస్‌సిఎస్‌సి జాయింట్ సెక్రటరీ రఘు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సిఎస్‌సి జాయింట్ సెక్రటరీ రఘు మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం 2015లో షీ షటిల్ బస్సులను రెండు ప్రారంభించామని తెలిపారు.

Also read: మే 1 నుంచి రాచకొండ పోలీసుల కొత్త ఫోన్ నంబర్లు

ఇప్పుడు ఐటి, ఐటిఈఎస్ మహిళా ఉద్యోగుల కోసం 18 బస్సులను విజయవంతంగా నడిపిస్తున్నామని, ఉద్యోగులను వారి స్థానాలకు ఉచితంగా చేర్చుతున్నామని తెలిపారు. ఈ బస్సు హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ నుంచి ఎన్‌పిసిఐ మీదుగా ఐటి, ఐటిఈఎస్ కంపెనీల మీదుగా చేరుతుందని తెలిపారు. బస్సు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎడిపి సంస్థకు అభినందనలు తెలిపారు. ఎడిసిపి సంస్థ ఎండి విజయ్ వేములపల్లి మాట్లాడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్‌లో ఉన్న ఎడిపి సంస్థ చాలా పెద్దదని అన్నారు.

Also read: తెలంగాణ టూరిజం @ రూ. 100 కోట్ల టర్నోవర్

షీషటిల్ ఏర్పాటు చేసేందుకు తాము సహకరించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ బస్సు ఏర్పాటు చేయడం వల్ల హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ నుంచి కోకాపేట, ఫైనాన్షియల్ జిల్లా వెళ్లే వారు ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. బస్సు ఏర్పాటు వల్ల మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో పోలీసులు,ఎడిబి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News