Sunday, December 22, 2024

తుపాకీతో తరగతి గదిలోకి దూరిన ఆగంతకుడు

- Advertisement -
- Advertisement -

మాల్డా (పశ్చిమబెంగాల్) : పాత మాల్డాలోని ఒక స్కూలు తరగతిలో తుపాకీతో చొరబడి విద్యార్థులను బెదిరిస్తున్న ఆగంతకుడిని పోలీస్‌లు పట్టుకోగలిగారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. పా త మాల్డాలోని ముచియా అంచల్ చంద్రమోహన్ హైస్కూలు 8వ తరగతిలో విద్యార్ధులు ఉండగా, తుపాకీ పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. కేకలు వేస్తూ విద్యార్థులను, టీచర్‌ను కాల్చి చంపుతానని బెదిరించాడు. దీంతో పాఠశాల నుంచి విద్యార్థులను బయటకు పంపించి ఉపాధ్యాయులు తరగతులను రద్దు చేశారు. అయినా సరే ఈలోగా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడి తమ పిల్లల కోసం అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటన కలవరం కలిగించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

అయితే స్థానికులు, పోలీసులు అతడ్ని చాకచక్యంగా బంధించ గలిగారు. అతని పేరు వల్లభ్ అని గుర్తించారు. నిందితుడి నుంచి పిస్టల్, ఏదో ద్రవం కలిగిన రెండు సీసాలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి తన కొడుకు, భార్య కనిపించక పోవడంతో అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకునేలా ఒత్తిడి తేడానికి ఈ విధంగా నటించానని తరువాత చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనపై సిఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. పోలీసులు అప్రమత్తమై ఈ ముప్పును తప్పించగలిగారని అభినందించారు. ఇది ఉన్మాద చర్య కాదని, ఒక పన్నాగమని ఆమె పాత్రికేయుల సమావేశంలో చెప్పారు. అయితే ఇరుగుపొరుగు వారు నిందితుడు భార్య, కొడుకును విడిచిపెట్టి వేరుగా ఉంటున్నాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News