న్యూఢిల్లీ : ఘర్షణలతో చెలరేగుతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన ప్రతి భారతీయుడ్ని స్వదేశానికి సురక్షితంగా తరలిస్తామని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా హామీ ఇచ్చారు. సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి పరిస్థితులను నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని గురువారం ఆయన మీడియాకు ఆయన చెప్పారు. సూడాన్‌లో 3500 మంది భారతీయులు, 1000 మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకొని ఉండవచ్చని చెప్పారు.
Also Read: స్వలింగ దంపతులకు సామాజిక ప్రయోజనాలు ఎలా అందుతాయి?
ఇప్పటివరకు 1700 మందిరి పైగా భారతీయులు ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ నుంచి బయటపడ్డారు. తరలింపులో భాగంగా మూడో నౌక తరకష్ సూడాన్ పోర్టుకు చేరుకుందని, మరోవైపు సూడాన్ నుంచి సౌదీ అరేబియాకు చేరుకున్న 360 మంది భారతీయులు జెడ్డా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారని వెల్లడించారు. భారతీయుల తరలింపునకు సహకరిస్తున్న సౌదీ అరేబియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఇతర దేశాల పౌరులను తరలించాలని అభ్యర్థనలు వస్తున్నాయని, వాటిని భారత్ స్వీకరిస్తోందని పేర్కొన్నారు.