Monday, December 23, 2024

గవర్నర్‌కు షర్మిల లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ స్కాములో ఐటి విభాగం పాత్రపై సిట్ దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో నివేదిక కోరాలని రాష్ట్ర గవర్నర్ తమిళసైకి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విజ్ణప్తి చేశారు. గురువారం గవర్నర్‌కు రాసిన లేఖను షర్మిల మీడియాకు విడుదల చేశారు. ఏళ్లతరబడి కష్టపడి పరీక్షలకు సిద్దమైన అభ్యర్ధుల ఆశలమీద నీల్లు చల్చి వారి భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చారన్నారు.

ఐటి శాఖలోని కొందరు వ్యక్తులు సహకరించినందువల్లనే పేపర్‌లీక్ సాధ్యపడిందన్నారు. ఈ స్కామ్‌లో సిట్ విచారణ ఎంతవరకు వచ్చిందో నివేదిక కోరాలన్నారు. ఇది చాలా కీలకమైన అంశం అన్నారు. ఇందులో పెద్దతలకాయలు తప్పించుకునే అవకాశం లేకుండా చేయాలని షర్మిల ఈ మేరకు గవర్నర్‌కు రాసినలేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News