హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు బలం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్,. కార్యకర్తలేనని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. సిఎం కెసిఆర్ విజనరీ లీడర్ షిప్ అవసరమన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూసిన గొప్పస నాయకుడు సిఎం కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు గొప్ప పాత్ర పోషించారన్నారు. నాయకులు,కార్యకర్తలు కలిసి పనిచేస్తూ పార్టీని ‘ నేషనల్ మిషన్’(National Mission)తో ముందుకు తీసుకుపోవాలని సూచించారు.
Also Read: జవాన్ల శవపేటికను మోసిన సిఎం..
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. దేశమే అబ్బురపడేలా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్త సెక్రటేరియట్ వంటి గొప్ప గొప్ప నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. నిన్నటి దాకా నదులు సముద్రంలో కలిసేవని నేడు కెసిఆర్ పాలనలో నదులు పొలాలకు , ఇండ్లళ్లకు మళ్లుతూ సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలు 75 ఏండ్లలో చేయలేని పనులను 9 ఏండ్లలో చేసి చూపించగలిగామన్నారు.
Also Read: చెన్నైతో మ్యాచ్.. దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ ఓపెనర్లు..
ప్రధాని మోదీదేశాన్ని అదానీకి దోచిపెడుతుంటే, సిఎం కెసిఆర్ పేదల సంక్షేమానికి మళ్లీస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జల వనరుల లభ్యతను, నదీ ప్రవాహాలను స్క్రీన్‌పై ఇంజినీర్‌లా సోదాహరణంగా వివరించిన సిఎం కెసిఆర్ వంటి నాయకుడు మరొకరు లేరన్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారని, ప్రజారోగ్యం రంగంలో తెలంగాణ తెచ్చిన సంస్కరణలను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ గొప్పగా ప్రశంసించిందని గుర్తు చేశారు. ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ కావాలన్న ప్రొగ్రెసివ్ లీడర్ సీఎం కేసీఆర్ అని ఆయన తెలిపారు.