Monday, December 23, 2024

మోడీకి మూడింది.. గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం: జగదీష్ రెడ్ది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని మోడీకి మూడిందని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధమౌతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణా భవన్ లో జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ అనంతరం తెలంగాణా భవన్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కుడా పనికి రాకుండా పోయిందని ఆయన ఎద్దేవాచేశారు. ప్రజల ఎజెండాతోటే ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లోకీ అడుగిడుగుతున్నారన్నారు.

Also Read: దళితులబంధు పథకంపై ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్ సీరియస్ వార్నింగ్

ఎత్తుగడలలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట అని, ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వెయ్యలో సిఎం కెసిఆర్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన స్పష్టం చేశారు. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. అటువంటి ఎత్తుగడలతో తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోటే దేశ రాజకీయాల్లోకి అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News