ఎసి హెల్మెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల అందజేత
రాచకొండ సిపి డిఎస్ చౌహాన్
హైదరాబాద్: ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి ఎసి హెల్మెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను గురువారం ఆయన అందజేశారు. వేసవిలో ట్రాఫిక్ సిబ్బంది డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు రూ.5లక్షల విలువైన 71,250 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఎసి హెల్మెట్లను ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండల తీవ్రత నుంచి రక్షించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సరైన నంబర్ ప్లేట్ లేని, నకిలీ నంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: మోడీకి మూడింది.. గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం: జగదీష్ రెడ్ది
నకిలీ నంబర్ ప్లేట్ పెట్టుకున వారిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు సిపి రూ.3.2 కోట్ల విలువైన స్పీడ్‌గన్‌లు, డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరకరాలు, బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, కిట్‌బ్యాగులు, సేఫ్టీ హెల్మెట్లు, మాస్క్‌లు, రేడియం జాకెట్లు, సన్‌గ్లాసెస్, గ్లోవ్స్, వాటర్ బాటిల్స్, జంగిల్ షూస్, రెయిన్‌కోట్స్ తదితరాలను ట్రాఫిక్ పోలీసులకు అందజేయనున్నారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ సిపి సత్యనారాయణ, డిసిపిలు శ్రీనివాస్, హరికృష్ణ, ఎసిపిలు శ్రీనివాసరావు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.