Thursday, December 19, 2024

వీటో అధికారం దుర్వినియోగం: శక్తివంత దేశాలపై ఇండియా విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: కొన్ని దేశాలకు సంక్రమించిన వీటో హక్కు చివరికి ఆయా దేశాల స్వార్ధ ప్రయోజనాలకే వినియోగపడుతోందని ఐరాస వేదిక నుంచి భారతదేశం విమర్శించింది. మునుపటి ఏర్పాటు ప్రకారం ఇప్పుడు భద్రతా మండలిలో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలే శాశ్వత సభ్యదేశాల అధికారంతో శక్తివంతమైన వీటో హక్కును పొందాయి. అయితే అత్యంత కీలకమైన ప్రాపంచిక విషయాలపై కొన్ని దేశాలు వాడుకుంటున్న వీటో హక్కుతో మానవాళికి సకాలంలో అందాల్సిన మేలు జరగడం లేదని ఐరాసలో ప్రతీక్ మథూర్ తెలిపారు. ఇప్పుడు వీటో వినియోగం కేవలం రాజకీయ ప్రయోజనాల దిశలోనే సాగుతోందని, నైతిక బాధ్యతతో కాదని విమర్శించారు.

Also Read: డ్రగ్స్ ఇచ్చి మృగ వాంఛ తీర్చుకున్నాడు.. భారతీయుడిని దోషిగా తేల్చిన సిడ్నీ కోర్టు

వీటో హక్కు వాడకంపై ఐరాస సాధారణ సభలో జరిగిన ప్లీనరీలో భారతదేశం తరఫున ఈ ప్రతినిధి తమ గళం విన్పించారు. గత 75 ఏండ్లుగా ఇదే తంతు సాగుతోందని, ఈ తరహా వీటో ప్రయోగానికి అడ్డుకట్ట పడకుంటే ఇదే తంతు నిర్విరామంగా సాగుతుందని భారత ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస ఉద్ధేశం అయిన సర్వసత్తాకతల సమానతకు విరుద్ధంగా ఐదు దేశాలకే వీటో హక్కు ఉండటం వల్ల పలు అనర్థాలకు దారితీస్తోందని, ఏకంగా ఐరాస అసలు లక్షాలే దెబ్బతింటున్నాయని, కొన్ని దేశాల ఆధిపత్యానికి ఈ వీటో అధికారం ఆయుధం అవుతోందని భారత ప్రతినిధి విమర్శించారు.

వీటో ఇన్షియేటివ్‌ను 193 మంది సభ్యదేశాల ప్రతినిధి సభ ఆమోదించి ఏడాది అయిన సందర్భంగా వీటో హక్కు వినియోగంపై ప్లీనరీ జరిగింది. భద్రతా మండలిలో ఏదైనా అంశంపై వీటో వినియోగం జరిగితే తప్పనిసరిగా దీనిపై సర్వ ప్రతినిధి సభలో చర్చకు పెట్టాలనే తీర్మానం గత ఏడాది ఎప్రిల్‌లో ఆమోదం పొందింది. దీనినే వీటో ఇన్షియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తరువాత భద్రతా మండలిలో దీనిపై తీర్మానం చేసినప్పుడు రష్యా దీనిని వ్యతిరేకిస్తూ తన వీటో హక్కు వాడుకుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఐరాస జనరల్ అసెంబ్లీలో వీటో ఇనిషియేటివ్ తీర్మానం ఆమోదం తరువాత ఇండియా స్పందిస్తూ సంబంధిత తీర్మానాన్ని ముందుగా సభ్యదేశాలకు తెలియచేయకుండా ఏకపక్షంగా ఆమోదించడం అనుచితం అని, దీని పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News