Saturday, November 16, 2024

నకిలీ ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్సులు తయారి ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

గద్వాల: వాహనాల నకిలీ ఇన్సూరెన్సులు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నాయకుడితో పాటు మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి కె. సృజన వివరాలను వెల్లడించారు. ముఠాలోని ప్రధాన నిందితుడు మీసాల రామస్వామి వృత్తిరీత్యా కర్నూలులో ఆర్టిఏ ఏజెంట్‌గా పనిచేశాడని తెలిపారు. ఇదే సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకొని తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని దేశీయ, విదేశీకు చెందిన 16 కంపెనీల లోగోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఎస్‌పి పేర్కొన్నారు.

నకిలీ ధ్రువపత్రాలతో జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నల్గొండ, వనపర్తి, కర్నూల్ , నంద్యాల, అనంతపూర్ జిల్లాలో తన ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా వినియోగదారుల నుంచి వివిధ వాహనాల విలువలను బట్టి రూ. 1000 నుంచి 4వేల వరకు తీసుకొని అందులో 50శాతం తీసుకొని మిగిలిన 50 శాతాన్ని ఏజెంట్లకు ఇచ్చి కస్టమర్స్‌కు కావాల్సిన ఫిట్నెస్, ట్రాన్స్‌ఫర్, పర్మిట్ మొదలైన వాటికి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి అటు ప్రభుత్వాన్ని, ఇన్సూరెన్స్ కంపెనీ మోసగించారని ఎస్‌పి పేర్కొన్నారు. అంతేకాకుండా రామస్వామి తప్పుడు ఆర్సీలను, డ్రైవింగ్ లైసెన్స్‌లను సైతం అవసరమైన వారికి ఇచ్చి వారి వద్ద నుంచి రూ. 1000ల నుంచి రూ. 3000వరకు తీసుకొని వారిని కూడా మోగించాడని ఆమె తెలిపారు.

మీసాల రామస్వామిపై గతంలో 2015 సంవత్సరంలో కర్నూల్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లి వచ్చాడరన్నారు. విశ్వసనీయ సమాచారం 26వ తేదీ సాయంత్రం అలంపూర్ సిఐ సూర్య నాయక్ , ఉండవెల్లి ఎస్‌ఐ బాలరాజ్ వారి బృందం అలంపూర్ చౌరస్తా కర్నూల్ టౌన్‌కు చెందిన ముఠా నాయకుడు రామస్వామితో పాటు మరో పదహారు మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి వివిధ నకిలీ డాక్యుమెంట్స్ , వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలైన కలర్ ప్రింటర్స్, రెండు లాప్టాప్‌లు, వివిధ కంపెనీల లోగో కలిగిన డాక్యుమెంట్స్ , రబ్బర్ స్టాంప్స్, 16 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకొని వారిపై ఉండవల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

పోలసులు అదుపులోకి తీసుకున్న వారిలో మీసాల రామస్వామితోపాటు గుర్రప్ప, చంద్రకుమార్ , తలనేరు రవికుమార్, నీచనమిట్ట శ్రీకాంత్, ఆకేపోగు సుధాకర్, తెలుగు విశ్వనాథ్, తెలుగు మధుసూదన్, గుండెపోగుల రంగన్న, షఫీ, కోళ్ల ప్రేమ్‌కుమార్, పొత్తిలి సురేష్‌గౌడ్, బోయిని నగేష్ , కొట్ర లక్ష్మయ్య, తిమ్మయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, సాగినల రఘునాథ్, దాసరి ప్రవీణ్‌లు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News