Friday, December 20, 2024

చైన్‌ స్నాచింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాత్రి సమయంలో చైన్‌ స్నాచింగ్‌లు చేస్తున్న వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన సంగమేశ్వర అలియాస్ వర్షిత్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

Also Read: మెడికల్ కళాశాలకు రూ.150 కోట్లు మంజూరు

జల్సాలకు అలవాటుపడిన నిందితుడు డబ్బులు సరిపోకపోవడంతో రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచింగ్ చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీన చందానగర్ పిజెఆర్ స్టేడియం వద్ద నుంచి ఒంటరిగా నడుచుకుంటు వెళ్తున్న మహిళ మెడలోని చైన్‌స్నాచింగ్ చేశాడు. బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News