- Advertisement -
హైదరాబాద్ : ఫిలిప్పీన్స్ దేశంలో ఈ నెల 20 నుండి 24 వ తేదీ వరకు జరిగిన ఏసియా 7 ఎస్ ఛాంపియన్ షిప్ లో భారత ఫుట్ బాల్ లో రాణించిన హైదరాబాద్ కు చెందిన తేజ రెడ్డిని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆ క్రీడాకారుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ ఆల వెంకటేశ్వర్ రెడ్డి , పట్నం నరేందర్ రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -