Monday, November 25, 2024

యువకుడి హత్య కేసులో ఆరుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఈ నెల 24వ తేదీన యువకుడిని హత్య చేసిన నిందితులను కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సౌత్‌వెస్ట్ జోన్ డిసిపి కుల్సుంపుర పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన బైద్ యోగేష్, నైగోడే శంకర్ అలియాస్ ఈము, బొళ్లం శరత్ కుమార్, కొండె వరుణ్, ఆకాష్, బోడి మహేష్, కళ్లుకోటల రాజాస్వామి అలియాస్ స్వామి కలిసి యువకుడిని కొట్టి హత్య చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, ఆకాష్ పరారీలో ఉన్నాడు. నిందితుల్లో బైద్ యోగేష్, వరుణ్ రావు, రాజాస్వామిపై కుల్సుంపుర పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది.

మహ్మద్ సోహైల్, భోస్లే దీపక్ కుమార్ స్నేహితులు. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న దీపక్ ఈ నెల 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు డెలివరీ ఇచ్చేందుకు బైక్‌ను తీయగా అందులో పెట్రోల్ లేని విషయం గమనించాడు. బైక్‌ను దీపక్ తన స్నేహితుడు సోహైల్ ఇంటి వద్ద పెట్టి ఇద్దరు కలిసి పెట్రోల్ కొనుగోలు చేసేందుకు బాటిల్‌తో పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. బంక్ మూసివేసి ఉండడంతో తిరిగి కమేలా మార్కెట్ నుంచి వస్తుండగా అక్కడ ఆరుగురు యువకులు ఉన్నారు. వారు సోహైల్‌ను ఆపి ఫైజాన్ ఎక్కడా, తన యోగేష్ బైక్‌ను తీసుకుని వెళ్లాడని, తిరిగి రాలేదని ప్రశ్నించారు. ఫైజాన్ ఆచూకీ తనకు కూడా తెలియదని సోహైల్ చెప్పాడు. తెలియదని చెబుతావా అని అందరు కలిసి బైక్‌పై ఇద్దరి బలవంతంగా ఎక్కించుకుని తాడ్‌బన్ రోడ్డు, బహదుర్‌పుర వైపు తీసుకుని వెళ్లాడు.

Also Read: జాన్సన్ రుణోదంతం.. బిబిసి ఛైర్మన్ రిచర్డ్ రాజీనామా

కమేలా మార్కెట్ సమీపంలోని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లి అక్కడ ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. తర్వాత ముసీ నది వెనుక ఉన్న మజీద్ వద్దకు తీసుకుని వెళ్లి మళ్లీ దాడి చేసి జిహెచ్‌ఎంసి కాలనీ, జియాగూడ, కే బ్లాక్ బిల్డింగ్‌పై సోహైల్‌పై బెల్టు, కర్రలతో దాడి చేశారు, కాని శంకర్ బీర్‌బాటిల్‌తో సోహైల్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారు బిల్డింగ్‌పై ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కుల్సుంపుర పోలీసులు ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోహైల్ మృతిచెందాడు. కేసు నమోదు చేకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News