Friday, November 22, 2024

అతీక్ బ్రదర్స్ మీడియా పరేడ్ ఎందుకు?.. సుప్రీం సూటి ప్రశ్న

- Advertisement -
- Advertisement -

యుపి సర్కారుకు సుప్రీం సూటి ప్రశ్న

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్, ఆయన సోదరుడి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న సంధించింది. అతీక్ తనకు ప్రాణభయం ఉందని చెప్పడం జరిగింది. మరి ఆయనను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి సోదరుడితో పాటు తీసుకువెళ్లినప్పుడు మీడియా ముందు ఎందుకు నిలబెట్టారు? వారిని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకువెళ్లలేదు? నడిపించుకుంటూ, పరేడు చేయించినట్లు ఎందుకు వ్యవహరించారు? ప్రయాగ్‌రాజ్‌లో పోలీసు కస్టడీలో ఉన్న దశలో ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో ఇతరత్రా ఘటనకు అవకాశాలు ఎందుకు కల్పించారు? అని న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం యుపి సర్కారును నిలదీసింది.

Also Read: జాన్సన్ రుణోదంతం.. బిబిసి ఛైర్మన్ రిచర్డ్ రాజీనామా

అలహాబాద్‌లో అతీక్‌ను ఆయన అన్నను టీవీ రిపోర్టర్ల పేరిట వచ్చిన వారే అతిదగ్గరి నుంచి గన్స్ తీసుకుని కాల్చివేశారు. అహ్మద్ ఆయన సోదరుడు అష్రఫ్ హత్యలపై స్వతంత్రమైన దర్యాప్తు ఆదేశాలు వెలువరించాలని, అప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయని న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ దశలో ధర్మాసనం స్పందించింది. వీరిద్దరిని ఆసుపత్రికి తీసుకువెళ్లుతున్నట్లు ముందుగానే టీవీ ప్రతికా మీడియాకు ఏ విధంగా సమాచారం అందింది? వారికి ముందు చికిత్సలు జరిపిస్తారా? లేక మీడియా ముందు నిలబడేలా చేస్తారా? పోలీసు బలగాలకు అక్కడ మీడియా ఉందని ముందుగా తెలిసి ఉండకపోవచ్చు.

Also Read: తైవాన్ దాపున 38చైనా విమానాలు

అయితే ఆసుపత్రి ఆవరణలో అయినా దీనిని పసిగట్టి వేరే దారిలో వారిని ఆసుపత్రిలోపలికి తీసుకుపోవచ్చు కదా, ఏకంగా వారిని తీసుకువెళ్లి పరేడ్‌కు దింపినట్లు చేశారెందుకు ? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యుపి ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ జవాబిస్తూ అప్పటి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని వివరించారు. త్రిసభ్య దర్యాప్తు సంఘం ఏర్పాటు అయిందన్నారు. హంతకులను వెంటనే పట్టుకున్నారని, సంచలనం , పేరు దక్కించుకునేందుకు ఈ విధంగాచేశామని వారు అంగీకరించారని రొహత్గీ తెలిపారు. దుండగులు జర్నలిస్టుల కార్డులతో వచ్చారని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అసలు మీడియా వీరిని చుట్టుముట్టేలా ఎందుకు చేశారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News