హైదరాబాద్ : హైదరాబాద్ లో పలు చోట్ల ఇవాళ ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వర్షం కురిసింది.నగరంలోని హిమయత్ నగర్, నారక్ష్ణగూడ, సైదాబాద్, మలక్ పేట, కార్వాన్, షేక్ పేట, రాయదుర్గం, కెపిహెచ్ బి, కాప్రా, చర్లపల్లి, ఈసిఐఎల్, కుత్బల్లాపూర్, జగద్గిరిగుట్ట భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురువడంతో నగరంలో రోడ్ల వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు లోనైనారు. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
పలు చోట్ల నాలా పోంగి పోర్లుతున్నాయి.దీంతో జిహెచ్ఎంసి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 04021111111ను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అంతటా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.