న్యూస్ డెస్క్: ఢిల్లీ మెట్రో రైలులో హస్త ప్రయోగానికి పాల్పడిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్లు) తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను డిసిడబ్లు ఆదేశించింది. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి హస్తప్రయోగం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో డిసిడబ్లు స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు డిసిడబ్లు తెలిపింది. ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మే 1వ తేదీ కల్లా తీసుకున్న చర్యలేమిటో వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను డిసిడబ్లు ఆదేశించింది.
Also Read: ఇంటర్‌లో తక్కువ మార్కులు..ఇల్లు అద్దెకు ఇవ్వనన్న ఓనర్
ఇది అత్యంత జుగుప్సాకరమైన సంఘటనగా డిసిడబ్లు చైర్‌పర్సన్ స్వాతి మాలివల్ పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి నిస్సిగ్గుగా హస్తప్రయోగం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయని, ఇది అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన చర్యని ఆమె పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఢిల్లీ మెట్రోలో ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయని, మెట్రోలో మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలు ఇతరులకు హెచ్చరిక కావాలని ఆమె తెలిపారు.