Saturday, November 23, 2024

కాంగ్రెస్ హాయంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించిందన్నారు. ఇందుకోసం 6,696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్‌రోడ్డును కాంగ్రెస్ నిర్మించిందని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రామాణికమని ఆయనన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాల్నింటిపై సమీక్షిస్తామని అన్నారు. మల్లు రవి మాట్లాడుతూ అతిపెద్ద సచివాలయం ప్రజలకు ఏ విధంగా ఉపయోగమని ప్రశ్నించారు. సిఎం ఛాంబర్, ఐఎఎస్ అధికారులకు పెద్దగా ఉంటాయని కాని ప్రజలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. పాత సచివాలయమే బాగుండేదని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు, లక్షల ఇండ్ల నిర్మాణం, రుణమాఫి, ఆరోగ్యశ్రీ లాంటి నిర్ణయాలు పాత సచివాలయంలోనే జరిగాయని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల నిర్ణయం కూడా అక్కడి నుండే జరిగిందన్నారు. ఈ కొత్త సచివాలయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. దళితబంధు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ రెండు పడక గదులకు కొత్త సచివాలయం ఉపయోగపడుతుందా అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News