Saturday, November 23, 2024

రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సూపర్‌స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ న్యూయర్క్‌లా ఉందని ప్రశంసించారని ఇలా తెలంగాణలో జరిగిన అభివృద్ధి అందరికీ కనిపిస్తుందని కానీ కొందరు గజినీలకు మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. శనివారం కంది మండల పరిథిలోని కాశీపూర్ లో బసవ హరీశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన హరీష్‌రావు మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఉన్న రజినీకాంత్‌కు తెలంగాణ అభివృద్ది తెలిసింది కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బిజెపి గజినీలకు అర్థం కావడం లేదని ప్రతి పక్ష పార్టీల నేతలకు చురకలంటించారు. కెసిఆర్‌ను దించుతాం, బిఆర్‌ఎస్‌ను దించుతామని అంటున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు దించుతారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నందుకా, కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతారా, కెసిఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతారా, రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకా, కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నందుకా అని ఆయన ప్రతిపక్ష నేతలను నిలదీశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా టిహాబ్ వీహబ్ టిఎస్‌ఐపాస్‌తో పదిహేడు లక్షల ప్రవేట్ కొలువులు ఇచ్చిన ఘనత ఒక్క బిఆర్‌ఎస్ ప్రభు త్వానికే ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్, బిజెపి నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. దొంగ దీక్షలు, దొంగ పాదయాత్రలు చేస్తూ ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారాన్నరు. కానీ తెలంగాణ ప్రజలు బిజెపి, కాంగ్రెస్ నాయకుల కుట్రలు గమనిస్తున్నారని వారి ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్, కౌన్సిలర్ రామప్ప తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News