Friday, November 22, 2024

యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’..

- Advertisement -
- Advertisement -

‘నాంది’తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో దర్శకుడు విజయ్ కనకమేడల మీడియాతో మాట్లాడుతూ.. “నాంది సినిమా మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ‘ఉగ్రం’ కథ సిద్ధం చేసుకున్నాను.

ఈ కథ నరేష్‌కి అయితే బావుంటుందనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ పూర్తి రౌద్ర రసంతో చేయలేదు. ఇది ఆయనకి కొత్తగా ఉంటుందనిపించింది. ఆయనకి కథ చెబితే నచ్చింది. నరేష్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లీ ప్రజానీకం’ తర్వాత ఉగ్రం సినిమా మొదలుపెట్టడం జరిగింది. నిత్యం మనకు మిస్సింగ్ వార్తలు కనిపిస్తూనే వున్నాయి. హైకోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమవుతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్‌మెంట్‌ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా వుంటుందనే దానిపై కథ చేస్తే బావుంటుందనిపించింది.

ఈ సినిమాలో ‘నాంది’ కంటే ఎక్కువ ఎమోషన్స్, మాస్, ఇంటెన్స్ వుంటుంది. ఒక పోలీస్ అధికారి పాత్ర తీసుకున్నాం కాబట్టి యాక్షన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది. ‘ఉగ్రం’ మంచి యాక్షన్ థ్రిల్లర్. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వుంటాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు. ఇందులో హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. హీరోయిన్ పాత్రలో మిర్నా చాలా చక్కగా నటించింది. సినిమాలో మొత్తం మూడు పాటలున్నాయి. లవ్, ఫ్యామిలీ, టైటిల్ సాంగ్ ఉంటాయి. ఈ మూడు పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News