Monday, December 23, 2024

సకల సేవల సుందర సౌధం

- Advertisement -
- Advertisement -

మానవుడు బ్రతకాలంటే గుండె ఏ విధం గా పనిచేస్తుందో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ఒక కేంద్రం అవసరం ఈ కేంద్రమే సచివాలయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సచివాలయం తెలంగాణ రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. 2012లో ’మహానది భవన్’ పేరిట 6.75 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన చత్తీస్ ఘడ్ ప్రభుత్వం, ’వల్లబ్ భవన్’ పేరిట నిర్మించిన 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇవే ఇప్పటివరకు పెద్దవి.10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో వాటిని మించిన తెలంగాణ సచివాలయం రికార్డులకెక్కనుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభించుకోబోతున్నాం. ఈ ప్రాంగణ విస్తీర్ణం మొత్తం 26.98 ఎకరాలు. దీనిలో 20 ఎకరాల్లో దీర్ఘ చతురస్త్రాకారంలో కాంప్లెక్స్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతుంది. 150 ఏళ్లు నిలిచేలా భూకంపాలు, ప్రకంపనాలు తట్టుకునేలా డిజైన్ చేసింది.

ఈ సచివాలయానికి ఆర్కిటెక్ట్ గా పనిచేసిన పొన్ని ఎం. కాన్సెసావో, ఆస్కార్ కన్సెసావో చాలా సుందరంగా తీర్చిదిద్దారు . చారిత్రక, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా భాగ్యనగర్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ చారిత్రాత్మక ఇండో పర్షియన్ అరేబియన్ మిశ్రమ నిర్మాణ శైలితో కూడినటువంటి ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణం పూర్తయింది. తెలంగాణలో ఉన్న సాంస్కృతిక సంపద, జీవనశైలి అనే రెండంచెల స్ఫూర్తి సచివాలయ భవంతి నిర్మాణ శైలిలో అడుగడుగునా నిండి ఉం టుంది. నిజామాబాద్ లోని కాకతీయుల కాలం నాటి నీలకంటేశ్వరాలయం, వనపర్తి సంస్థానపు రాజ ప్రాసాదాల్లోని శైలి తో పాటు గుజరాత్ లోని సారంగాపూర్ హనుమాన్ ఆలయం స్పూర్తిగా గుమ్మటాలను నిర్మించారు. ఒక్క మాటతో చెప్పాలంటే సచివాలయం మాయ సభను తలపించేలా ఉందని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ తీరంలో సచివాలయం ముందున్న లుంబిని పార్క్, ఉత్తర భాగంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్, ఆ పక్కనే ఈ మధ్యనే ప్రారంభించుకున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం, లుంబిని పార్క్ పక్కనే నిర్మాణం లో అమరవీరుల స్తూపం ఇలా అన్నింటి రూపాలను సమూలంగా మార్చేలా హెచ్‌ఎండిఏ కార్యాచరణ రూపొందించింది.

Also Read: పగలు ధవళ వర్ణం! రాత్రిళ్లు సప్త వర్ణం!

హుస్సేన్ సాగర్ జలాల్లో నూతన సచివాలయ ప్రతిబింబం స్పష్టంగా కనిపించేలా నిర్మాణం జరిగింది. అంతేకాకుండా దేశ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా సాగర్ తీరం కొలువై ఉండాలని ఇప్పటికే అధికారులను కేసీఆర్ గారు ఆదేశించారు. ప్రస్తుతం సచివాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను సరికొత్తగా అభివృద్ధి చేయడమే లక్ష్యం గా హెచ్‌ఎండిఏ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం సచివాలయ చుట్టూ పక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ సమూలంగా మార్చేస్తూ సరికొత్త ల్యాండ్ స్కేపిoగ్ తో పార్కులను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది.

ఈ నూతన సచివాలయంలో మత కల్లో హాలకు తావివ్వకుండా అన్ని మతాలకు సరి సమానంగా మునుపటి మాదిరిగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మందిరాలను నిర్మించింది. ఆయా మత పెద్దల ఆకాంక్షాలకు మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును కల్పించింది దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించింది. తిరుపతి శిల్పాలు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయ స్వామి, సింహ, నంది విగ్రహాలతో పాటు శివలింగం తదితర రాతి శిల్పాలు తయారుచేసి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం టిటిడిని కోరింది. దీనికి అంగీకరించిన టిటిడి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళా సంస్థ ద్వారా 6 విగ్రహాలు తయారు చేసి అందజేసేలా ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ శిల్ప కళాశాల ప్రాంగణంలో సంబంధిత దేవతామూర్తుల శిల్పాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. దీనికోసం తమిళనాడులోని కంచి ప్రాంతం లో లభ్యమయ్యే కృష్ణ శిలలను సైతం తెప్పించింది. 28 ఎకరాలలో 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 20,065 అడుగుల ఈ భవనం ఎత్తున నిర్మించబడింది. ఈ నూతన సచివాల య భవన సముదాయ నిర్మాణం 2021 జనవరిలో ప్రారంభించబడింది.

సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తుందో అంతకు ధీటుగా బా హుబలి మహాద్వారం ఆకట్టుకుంటుంది 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల పొడవు ఎత్తున నాలుగు తలుపులతో దీన్ని తీర్చిదిద్దారు ఆదిలాబాద్ అడవుల్లోని టేకు కలపను నాగపూర్ పంపించి అక్కడ మహా ద్వారాన్ని తయారు చేయించారు కలపపై ఇత్తడి పోతతో నగీషీలు చెక్కించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో సచివాలయ నిర్వహణ సిబ్బంది స్టోర్స్, ఒకటవ అంతస్తులో సాధారణ పరిపాలన, రెండవ అంతస్తులో ఆర్థిక శాఖల కార్యాలయాలు, మూడు, ఐదు అంతస్తులో 16 మంది మంత్రుల కార్యాలయాలు, ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో పాటు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ’జనహిత’ పేరిట 250మంది కూర్చునే విధంగా ఒక హాలును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సిఎం, మంత్రుల వాహనాలకు వేరువేరుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసారు. సచివాలయ నిర్మాణ పనుల్లో 2200 మంది మూడు షిఫ్ట్ లలో పనిచేసారు. ఒకప్పుడు మహమ్మదీయ రాజులు తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ గుమ్మటాల నిర్మించినట్టుగా సచివాలయంలో భాగంగా రెండు భారీడోమ్స్ నిర్మించబడుతున్నాయి.

ఆధునిక నిర్మాణాల్లో అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీడోమ్స్ రూపొందించనుండడం ఇదే తొలిసారి. సచివాలయ భవనం పైన నాలుగు రకాలైన 34 డోములు ఏర్పాటు చేశారు. ఏ తరహా డోము 23.6 ఫీట్లు, బీ తరహ డోము 31 ఫీట్లు, సీ తరహ డోము 21.6 ఫీట్లు, డీ తరహా డోమ్ 54.8 ఫీట్లు గా రూపొoదిoచారు. ఈ డోముల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఇనుము అవసరం పడింది. ఒక్కో డోము 82 అడుగుల ఎత్తు (దాదాపు 8 అంతస్తులు), 52 అడుగుల వ్యాసంగా ఉంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్న భవనం డిజైన్ ప్రకారం తూర్పు, పడమర భాగాల్లో భవనంపై ఉంటాయి. డోము లోపలి భాగాన్ని స్కైలాoజ్ తరహాలో రూపొందిస్తున్నారు.

ఇందులోని విశాలమైన కిటికీల నుండి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోముల ప్రాంతం వి.ఐ.పి జోన్లుగా ఉంటాయి. సీఎం ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేలా రూపొందించబడుతుంది. పై భాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోములు కూడా తెలుపు రంగులోనే ఉండనున్నాయి. ఈ ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. భవనం పైన ఏర్పాటు చేసిన సౌర పలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్ సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచ్చిక బయళ్లకు వాన నీటిని వాడే ఉద్దేశంలో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యం తో మినీ రిజర్వాయర్ నిర్మించబడింది.

దగ్గుల వినోద్ యాదవ్
8919096589

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News