ఎంఈఎస్‌ది కీలక పాత్ర…
లింగాయత్‌లకు గట్టి పట్టున్న బెల్గావిలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి
బెల్గావి: బెంగళూరు అర్బన్ తర్వాత రెండో అత్యధిక అసెంబ్లీ సీట్లున్న జిల్లా బెల్గావి. ఇక్కడ లిగాయత్‌లదే పట్టు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బిజెపి నువ్వా, నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కానీ ఇక్కడ మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్) ది కూడా కీలక పాత్రగా ఉంది. ఇది కొన్ని సీట్లపై ప్రభావం చూపనున్నది. ఎంఈఎస్ సరిహద్దు సమస్యను సజీవంగా ఉంచాలని కోరుకుంటోంది.
సరిహద్దు జిల్లా అయిన బెల్గావిలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ లింగాయత్‌లదే పట్టు. గత రెండు దశాబ్దాలుగా బిజెపికి కంచుకోటగా ఉంది. ఈసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్, బిజెపి మధ్య తీవ్ర పాటి ఉండనున్నది. మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవడి బెల్గావిలో వీలయినంత ఓట్లు పొందనున్నారు. బెల్గావిలో 40 శాతం మంది మరాఠి మాట్లాడే వాళ్లే ఉంటారు. ఓబిసీలు, ఎస్సీ/ఎస్టీలు కూడా ఎక్కువే ఉన్నారు.
బెల్గావి జిల్లాలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 39.01 లక్షల ఓటర్లు ఉన్నారు. వారిలో 1968928 మంది పురుష ఓటర్లు, 1932576 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 141 మంది ఇతరముల కింద ఓటర్లుగా ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 10సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి.