Friday, December 20, 2024

చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేరు: కోడాలి నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు చేతకాని దద్దమ్మలు అని, ఒకరు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని వైసిపి ఎంఎల్‌ఎ కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోక వ్యక్తి తన కుమారుడిని ఎంఎల్‌ఎగా గెలిపించుకోలేకపోయరని ఎద్దేవా చేశారు. వీళ్ల టార్గెట్లకు ప్రజలు ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. వైనాట్ 175 సిఎం జగన్ టార్గెట్ అని, హైదరాబాద్‌లో మీటింగ్‌లు పెట్టుకునే వలసదారులకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కులేదన్నారు.

జనసేన పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేస్తే పవన్‌ను జనం నేలకేసి కొట్టారని కోడాలి చురకలంటించారు. సినిమాలు చేయాలో… రాజకీయాలు చేయాలో తెలియక పవన్ ఇంట్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నాదెండ్ల మనోహర్ రాసిచ్చిన స్లిప్పులు చదవడమే పవన్ పని అని, జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారని కోడాలి ప్రశంసించారు. పవన్‌కు చంద్రబాబు అధికారంలో ఉండటమే కావాలని, పవన్ ఎవరి కోసం పని చేస్తున్నాడో అభిమానులు తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు గుడివాడలో తన వెంట్రుక ముక్క కూడా పీకలేరని కోడాలి సవాలు విసిరారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఒక బకరా కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News