Friday, January 10, 2025

తెలంగాణ ప్రగతికి చిహ్నంగా నూతన సచివాలయం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టే ఏ కార్యక్రమైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రగతికి చిహ్నంగా , అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశం గర్వపడేలా ఉంటున్నాయన్నారు.

Also Read: IPL 2023: చెలరేగిన కాన్వే.. పంజాబ్ లక్ష్యం 201

నూతన సచివాలయ భవనం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపొందిందన్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను నిత్యం స్మరించుకొనేలా సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణం అవుతుందని, ఇది గర్వకారణమని ఆయన వెల్లడించారు. బిఆర్ అంబేద్కర్ పేరును సార్థకం చేసేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టడం, అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం తెలంగాణ సమాజానికే గర్వకారణమని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News