Monday, January 20, 2025

వెబ్‌సైట్‌లో ఎంసెట్ హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యామండలి ఉంచింది. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి 15వ రకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్, 12,13,14 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 10వ తేదీతో ముగియగా మే 2వరకు అపరాధ రుసుముతో అవకాశం ఉంది. ఎంసెట్‌కు ప్రతి 100మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకున్నారు. రూ. 250 నుంచి రూ. 5వేల వరకు అదనంగా చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 5వేల చెల్లించి 59 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News