- Advertisement -
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయంలో మధ్యాహ్నం సమగ్ర సమీక్ష చేపట్టనున్నారు. కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వలపై అధికారులతో కెసిఆర్ చర్చించనున్నారు. నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్ కాలువలపై నిర్మాణాల గురించి అధికారులను కెసిఆర్ అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులకు హాజరుకానున్నారు.
- Advertisement -