- Advertisement -
న్యూఢిల్లీ : ఎఫ్‌పిఒలు, వ్యవసాయ ఎంఎస్‌ఎంఇల కోసం ఫార్మ్ పాస్ ద్వారా డిజిటల్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ఉత్పాదనను అందించడానికి ఎం1ఎక్సేంజ్‌తో కలసి పని చేయనున్నట్టు మాస్టర్‌కార్డ్ ప్రకటించింది. 10 మిలియన్ల మంది రైతులు, వ్యవసాయ ఎంఎస్‌ఎంఇలకు వారి క్రెడిట్ యాక్సెస్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పరిష్కరించడం ద్వారా ప్రయోజనం చేకూర్చడం ఈ ఉత్పాదన లక్ష్యంగా ఉంది. ఫార్మ్ పాస్ అనేది మాస్టర్ కార్డ్ కమ్యూనిటీ పాస్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా ఉంది.
ఎం1ఎక్సేంజ్ సిఇఒ సందీప్ మొహింద్రు మాట్లాడుతూ, ఎం1ఎక్సేంజ్ టిఆర్‌ఇడిఎస్‌లోని ఫైనాన్షియర్‌ల పెద్ద నెట్‌వర్క్ ఫార్మ్ పాస్ ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలుదారులు, అమ్మకందారుల కోసం లిక్విడిటీ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుందని అన్నారు.
- Advertisement -