Monday, November 18, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం…. కానిస్టేబుల్ ను కాటేసిన కరెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో అర్థరాత్రి భారీ వర్షాలు కురవడంతో నగరం తడిసిముద్దయింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వరదల ముంచెత్తడంతో పాదచారి కొట్టుకొని పోతుండగా స్థానికులు కాపాడారు.  వరదలు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత రాత్రి తొమ్మిద గంటల నుంచి భారీ వర్షం గంట సేపు కురిసింది. గచ్చిబౌలిలో 6.3 సెంటీ మీటర్ల వర్షం పడింది. తీవ్ర గాలులకు రాత్రి సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనాలు, కార్లు వరదలో మునిగిపోయాయి.  హైదరాబాద్ లో లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసిన వరద నీరు ప్రవహిస్తోంది.  దీంతో జిహెచ్‌ఎంపి, అధికారులు బల్దియా సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో నీరు పోయేలా చర్యలు చేపట్టారు.

Hyderabad rains update

జూబ్లీహిల్స్‌లో పరిధిలో కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి చెందాడు. మహబూబాబాద్‌కు చెందిన సోలెం వీరాస్వామి గ్రేహౌండ్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన సొదరుడు ఇంటికి యూసుఫ్‌గూడకు వచ్చి వెళ్తుండగా ఎన్‌టిఆర్ భవన్ వద్ద కరెంట్ స్తంభానికి బైక్‌ను ఢీకొట్టారు. కరెంట్ విద్యుత్ సరఫరా కావడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ: కెటిఆర్

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News