Monday, November 18, 2024

వైన్ షాపు వద్ద నిందితుడు..కానిస్టేబుల్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. మద్యం తాగాలన్న కోరికను బయటపెట్టిన ఒక నిందితుడికి దగ్గరుండి మద్యం షాపులో మద్యం కొనిచ్చారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఆ పోలీసును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.

సిఆర్‌పిసి సెక్షన్ 151 కింద అరెస్టు చేసిన ఒక నిందితుడిని ముగ్గురు పోలీసుల ఎస్కార్టుతో కోర్టులో హాజరుపరిచేందుకు వెళుతుండగా దారిలో మద్యం దుకాణం చూడగానే మందు కొట్టాలన్న కోరిక నిందితుడికి పుట్టింది. ఆ విషయాన్ని కానిస్టేబుల్స్‌కు అతను చెప్పుకున్నాడు. సరే కొనుక్కో అంటూ ఒక కానిస్టేబుల్ దగ్గరుండి ఆ నిందితుడిని వైన్ సాపునకు తీసుకెళ్లాడు. చేతికి బేడీలు వేసుకున్న అతనికి మద్యం కొనుక్కోవడంలో ఆ కానిస్టేబుల్ సాయపడ్డాడు.
ఈ దృశ్యాన్ని దారినిపోయే దానయ్య ఒకరు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్‌పి ప్రకటించారు. సాయం చేస్తే కూడా సస్పెండ్ చేస్తారా అన్న సందేహం ఆ కానిస్టేబుల్‌కు వచ్చి ఉంటుందేమో..పాపం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News