- Advertisement -
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఫలితంగా ప్రభుత్వం 14 మెసేంజర్ మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి వాటిని విస్తృతంగా వాడుతున్నారని ఆరోపణ. ఈ యాప్‌లలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్‌మ్రీ, మీడియాఫైర్, బ్రియార్, బిఛాట్, నంద్‌బాక్స్, కొనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్‌లైన్, జాంగీ, థ్రీమా వంటివి ఉన్నాయి. అభిజ్ఞవర్గాల ప్రకారం ఈ మొబైల్ అప్లికేషన్‌లను కశ్మీర్‌లోని ఉగ్రవాదులు, తమ మద్దతుదారులు, ఆన్‌గ్రౌండ్ వర్కర్ల(ఒజిడబ్లు)తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లను ఐటి చట్టం 2000లోని సెక్షన్ 69ఏ కింద బ్లాక్ చేశారని అధికారులు తెలిపారు.
- Advertisement -