Monday, December 23, 2024

‘కౌ కిల్లర్ యాంట్ ’కుడితే ఎట్లుంటది?

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా(అమెరికా): ‘రెడ్ వెల్వెట్ యాంట్ ’ అనే చీమకున్న మరోపేరు(నిక్‌నేమ్) ‘కౌ కిల్లర్’. నిజానికిది చీమా కాదు, ఆవును చంపేదీ కాదు. కానీ ఇది కుడితే మాత్రం ఎంతగానో మండుతుంది, నొస్తుంది. దురదృష్టం కొద్దీ  ఫ్లోరిడాలోని ఓ మనిషిని ఇది కుట్టింది. ఆయన తన వ్యథను తెలుపుకున్నాడు.

ఎరిక్ బ్య్రూయర్ తన ఫేస్‌బుక్ గ్రూప్ అకౌంట్‌లో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. తనను కౌ కిల్లర్ యాంట్ కుట్టిందని తెలిపాడు. ఫేస్‌బుక్‌లో ఒకరు అలాంటి చీమను తాను చూడలెదన్నాడు. మరొకరు దాని ఫోటోను షేర్ చేస్తే గుర్తుపడతానన్నాడు.
ఎరిక్ బ్యూరర్ తనను ఆ చీమ 2020 మధ్య కాలంలో కుట్టిందన్నాడు. తాను బైక్ దిగి ఫ్లోరిడాలోని డేవెన్‌పోర్ట్‌లో ఉన్న ప్యూబిక్స్ సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించానని, కొన్ని అడుగులు వేసానో లేదో ఆ చీమ నన్ను కుట్టిందన్నాడు. ‘అప్పుడు నాకు ఎవరో సిగరెట్ కాల్చి నా తొడలపై రుద్దినట్టయింది. దాంతో అక్కడ గట్గిగా చరిచాను. ఆ కీటకం నా ప్యాంట్ నుంచి కిందికి జారిపడింది. అది పొడుగ్గా నలుపుఎరుపు రంగులో ప్రకాశవంతంగా ఉండింది. ఆ కీటకం దాదాపు 1.5 సెమీ. పొడుగు ఉంది. అలాంటి అనుభవాన్ని నేనంతకు మునుపెన్నడు ఎదుర్కొనలేదు’ అని చెప్పుకొచ్చాడు.

ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శిటీ ప్రకారం దాదాపు 435 రకాల వెల్వెట్ చీమల రకాలున్నాయి. అవన్నీ కందిరీగ కుటుంబానికి చెందినవి. ఒక్క ఫ్లోరిడాలోనే 50 రకాలు ఉన్నాయి. ఈ కీటకాలను పరాన్న జీవులుగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి ఇతర కీటకాల ప్యూపపై గుడ్లు పెడతాయి. అవ కొత్తగా పొదిగిన వాటి సంతానానికి ఆహార వనరుగా మారతాయి. వెల్వెట్ చీమకు తనను కబలించే జంతువును తప్పించుకుని ఎగిరిపోలేవు. కానీ తీవ్రంగా కుడతాయి. ఈ కీటకం కుడితే కాగే నూనె చేతులపై పడినంత మంటగా ఉంటుందని నేచురల్ హిస్టరీ మ్యూజియం క్యూరేటర్ జస్టిన్ ష్కిమిత్ తెలిపారు. ఇది కుడితే కలిగే మంట కారణంగానే దానిని ‘కౌ కిల్లర్’ అని అంటుంటారు. వాస్తవానికి అది ఆవును చంపేంతదేమి కాదు. పైగా రెడ్ వెల్వెట్ చీమ కుడితే పశువులు చనిపోయాయన్న రుజువులేమి లేవు. అవి దాడిచేసేవేమి కావు. కాకపోతే వాటిని రెచ్చగొడితే మాత్రం అవి కుడతాయి. కాకపోతే ఇక్కడ బ్యూరర్‌ను కుట్టిన కేసు చాలా అరుదయినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News