Thursday, January 9, 2025

స్వగతం కాదు.. కర్నాటకకు ఏం చేశారో చెప్పండి: మోడీకి రాహుల్ హితవు

- Advertisement -
- Advertisement -

తురువెకెరె: తనను 91 సార్లు అవమానించారంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం స్పందించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు తన గురించి జరగడం లేదని ప్రధాని మోడీ అర్థం చేసుకోవాలని రాహుల్ హితవు చెప్పారు. ప్రధాని మోడీ తన గురించి తాను చెప్పుకోవడం ఆపి కర్నాటకలో బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పాలని రాహుల్ సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం కర్నాటక వచ్చిన మీరు(మోడీ) కర్నాటక గురించే మాట్లాడండి.కాని మీరు మీ గురించే చెప్పుకుంటారు. గత తొమ్మిదేళ్లలో కర్నాటకలో ఏం చేశారో చెప్పండి. వచ్చే ఐదేళ్లలో ఏం చేయనున్నారో కూడా చెప్పండి. యువతకు, విద్య, ఆరోగ్య రంగాలకు, అవినీతి అంతానికి ఏం కార్యక్రమాలు చేపడతారో చెప్పండి అంటూ రాహుల్ నిలదీశారు.

గుముకూరు జిల్లాలో ఒక బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ..ఈ ఎన్నికలు మీ గురించి కాదని, కర్నాటక ప్రజలు, వారి భవిష్యత్తు గురించని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టిందని మీరు చెప్పారు కాని కర్నాటక గురంచి మాత్రం ఏమీ మాట్లాడరు అని ఆయన అన్నారు. ఈసారి ప్రసంగించినపుడు కర్నాటకకు ఏం చేశారో, రానున్న ఐదేళ్లలో ఏం చేయనున్నారో మాట్లాడండి అంటూ మోడీకి రాహుల్ సలహా ఇచ్చారు.

Also Read: క్రైపిఎం పేసిఎం: కాంగ్రెస్ వినూత్న ప్రచారం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News