Friday, December 27, 2024

పీజీ కోర్సులో ప్రవేశాలకు సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టిఎస్ సిపి గెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Also Read: ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు బాధితులకు శుభవార్త

రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని సీపీగెట్ కన్వీనర్ తెలిపారు. సీపీగెట్ పరీక్ష జూన్ ఆఖరివారంలో జరుగనున్నది. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంసిజె, మాస్టర్ ఆప్ లైబ్రరీ సైన్సు, ఎంఈడి, ఎం.పి.ఈడి వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్‌తో భర్తీ చేయనున్నది. పూర్తి వివరాల కోసం osmania.ac.in, cpget.tsche.ac.in, ouadmissions.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News