Saturday, November 23, 2024

ఒడిషాలో ఒబిసి సర్వే ఆరంభం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిషాలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒబిసి సర్వే ఆరంభం అయింది. ఈ ప్రక్రియ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. బిసిలపై జరిగే ఈ సర్వేను ఆన్‌లైన్‌లో పరోక్షంగా ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్షంగా ఒడిషా రాష్ట్ర బిసిల కమిషన్ ఈ నెల 27 వరకూ నిర్వహిస్తుందని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం 314 బ్లాక్‌లు, 114 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పెద్ద ఎత్తున చేపడుతారు. బీహార్ తరువాత దేశంలో బిసిల గణన జరిపే రెండో రాష్ట్రం ఒడిషానే అవుతోంది. రాష్ట్రంలోని బిసిలలో ఎంత మంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి జీవనాధారిత వృత్తి ఏమిటీ? విద్యార్హతలు ఏ మేరకు ఉన్నాయి?

ఏ తరహా విద్యాసంస్థలకు పిల్లలు చదువులకు వెళ్లుతున్నారు? వంటి వాటిపై దృష్టిసారించడం ద్వారా ఈ సర్వే ద్వారా వారి వెనుకబాటుతనం గురించి, వారి సామాజిక విద్యా స్థితిగతుల గురించి ఓ విశ్లేషణకు వచ్చే వీలుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో , వివిధ ప్రజా పంపిణీ దుకాణాలు (రేషన్ షాప్) వంటి చోట ప్రజలు ఈ సర్వే సందర్భంగా తమతమ స్థితిగతులను సంబంధిత పత్రాలతో అందచేయడం ద్వారా ఈ సర్వే సాగుతుంది. 208 ఒబిసి వర్గాల సామాజిక , ఆర్థిక విద్యా స్థితిగతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే దశలో తెలుసుకుంటుంది. తరువాత దీనిని విశ్లేషించుకుని వారిలో ఏ ఒక్క వర్గం కూడా వెనుకబాటుతనానికి గురికాకుండా ప్రత్యేక కార్యాచరణకు దిగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News