Monday, January 20, 2025

మహిళ మృతదేహంతో రోడ్డుపై గ్రామస్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : మండల పరిధిలోని అంబేద్కర్ కాలనీలో సోమవారం మహిళ మృతదేహన్ని రోడ్డు పైన ఉంచి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాలనీకి చెందిన కుక్కముడి శ్రావణి (24) ఆదివారం ఉరేసుకుని మృతి చెందింది. భర్త, కుటుంబ సభ్యులే హత్యచేశారని మృతురాలి తల్లి రాధ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానస్పదమృతిగా పోలీసులు కేసునమోదు చేసి భర్త దివ్యతేజ్‌కుమార్‌తో పాటు కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహన్ని ఆదివారం పోస్టుమార్టం కొరకు కొత్తగూడెం తరలించారు. తిరిగి సోమవారం మృతదేహాన్ని ఇంటికి తీసుకవచ్చారు.

ఈ సమయంలో వంతలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు,బందువులు మృతదేహన్ని తీసుకువచ్చిన ఆటోను రోడ్డుపైన ఉంచి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. హత్య చేసిన భర్త, అతని కుటుంబసభ్యులు వచ్చి దహనసంస్కారాలు చేయాలని శ్రావణి ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమయంలో పరిస్థితి ఉద్రిక్తతగా మారటంతో కొత్తగూడెం డీఎస్పీ రహమన్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, పలువురు ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఆందోళన కోనసాగుతుంది.
కార్మిక హక్కులు అరించపడ్డాయని అనేక కార్మిక చట్టాలను రద్దుచేశారని కార్మిక శ్రమను

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News