Monday, December 23, 2024

బాయిల్డ్ రైస్‌గా తడిసిన ధాన్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అకాలవర్షాల కారణంగా తడిసిపోయన ధాన్యం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్‌కింద మార్చేందుకు రైస్‌మిల్లర్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని వి ధంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.

వర్షాల తో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బా యిల్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసామన్నారు. మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అ త్యవసర బాయిల్ ఉత్తర్వులు ఇచ్చామని, సేకరణ జరుగుతున్న రీతిలో పెంచుతామన్నారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22వేల మెట్రి క్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూ ర్యాపేట కొత్తగూడెంలకు జిల్లాకు 14,706 మెట్రిక్ ట న్నులు, నిజమాబాద్లో 14,700, కరీంనగర్లో 7350, యాదాద్రి, జగిత్యాలల్లో 5000వేల మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్ ఆర్డర్ ఇచ్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News