ఆర్సిబి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన పరిధిలో తాను ఉంటాడు. ఎవరైనా కవ్విస్తే చాలు అంతకు రెండు రెట్లు పగ తీర్చుకుంటాడు. గతంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సిబి ఓడిపోయినప్పుడు లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ నోటికి తాళాలు వేసుకోవాలని సంజ్ఞ చేయడంతో విరాట్ మదిలో పెట్టుకున్నాడు. సోమవారం బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. లక్నో బ్యాట్స్మెన్లు ఔటై మైదానం వీడుతున్నప్పుడు గంబీరాల చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్టుగా విరాట్ సంజ్ఞ చేశాడు. ఇది కూడా ప్రతి సారి చేయడంతో తారాస్థాయికి చేరుకుంది. మ్యాచ్ ముగిశాక కోహ్లీ-గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారికి సర్ది చెప్పి విడదీశారు. విరాట్‌తో పెట్టుకుంటే విశ్వరూపమే కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Everything after handshake here:
Virat Kohli vs Gautam GambhirBIGGEST RIVALRY IN CRICKET
Entertainment into 100#RCBVSLSG #ViratKohli pic.twitter.com/8SxxSKRByn
— aqqu who (@aq30__) May 1, 2023
Also Read: లక్నోకు బెంగళూరు షాక్