వేల్స్: కెరీర్‌ను మార్చుకోవడం అన్నది చాలా కీలక నిర్ణయం. వేల్స్‌కు చెందిన బ్యూటీషియన్ జెస్సికా కాల్డ్‌వెల్(29) తన ఉద్యోగాన్ని మానేసి పూర్తి సమయం మంత్రెగత్తెగా మారిపోయింది. మంత్రవిద్యపై తన అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు ఆమె తన కొత్త వృత్తిలో ప్రతి నెలా వేల పౌండ్లను సంపాదిస్తోంది. ఆమె తన పాత ఉద్యోగం మానేశాక స్పెల్ బుక్స్, టారో కార్డ్‌లు, స్పటికాలలో పెట్టుబడి పెట్టి కొత్త వ్యాపారాన్ని ఆరంభించింది.
జెస్సిక కాల్డ్‌వెల్‌కు ఐదువేలకు పైగా క్లయింట్లు ఉన్నారు. మంత్రవిద్యపై ఆమె పట్టు సాధించింది. తన విజయానికి సోషల్ మీడియానే కారణమని ఆ క్రెడిటంతా సోషల్ మీడియాకే ఇస్తోంది. ఆమె క్లయింట్లను ఆకర్షించడానికి ఆన్‌లైనే తోడ్పడింది. ఆమె ఇదివరలో చేసిన సెలూన్ వర్కర్ జీతం కన్నా మూడింతలెక్కువ సంపాదిస్తోంది. ఆమె మంత్రెగత్తెగా కొనసాగుతోంది. తన మానసిక శక్తిని ఉపయోగిస్తోంది. ఆమె పూర్తి సమయం మంత్రెగత్తెగా తన వృత్తిని మొదలెట్టినప్పుడు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఫేస్‌బుక్‌లో 2019లో పారానార్మల్ గ్రూప్‌తో పరిచమైన తర్వాతే మంత్రగత్తెగా మారింది. 2020 నుంచి ఆమె వృత్తి ఊపందుకుంది. తన క్లయింట్లు తనతో అప్పాయింట్‌మెంట్‌లు తీసుకున్నాక తమ ప్రేమ గురించి ప్రశ్నించారన్నారు. తమ భాగస్వామి తమ గురించి ఏమనుకుంటున్నారో చెప్పమని ఆమెను అడుగుతున్నారట.