Saturday, November 23, 2024

నూతన ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరల వెల్లడి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా రెండు గ్రేడ్స్‌ (జెడ్‌ఎక్స్‌ మరియు వీఎక్స్‌) ధరలను వెల్లడించింది. ఈ వాహనం మెరుగైన ఫ్రంట్‌ ఫేసిమా కలిగి ఉంటుంది. దీనిని కఠినమైన మరియు ధృడమైన ప్రదర్శన కోసం నిర్థిష్టమైన ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్‌ అవసరాలు తీరుస్తుంది.

ఎక్స్‌ షోరూమ్‌ ధరలు, గ్రేడ్‌ల వివరాలు…

ఈ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు దేశవ్యాప్తంగా అన్ని గ్రేడ్‌లకూ వర్తిస్తాయి. ప్రీమియం కలర్స్‌కు అదనపు ధరలు వర్తిస్తాయి. తమ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపీవీ అగ్రగామిగా 2005లో మార్కెట్‌లో విడుదలైన నాటి నుంచి నిలువడంతో పాటుగా ఇప్పటి వరకూ ఒక మిలియన్‌కు పైగా యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ వాహనాన్ని ఈ సంవత్సరారంభంలో విడుదల చేసిన నాటి నుంచి ముందస్తు బుకింగ్స్‌ పరంగా అపూర్వ స్పందన అందుకుంది.

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సేల్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ ‘‘ నూతన ఇన్నోవా క్రిస్టల్‌ డీజిల్‌ టాప్‌ టూ గ్రేడ్‌ ధరలను వెల్లడించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నారు. దీని యొక్క కఠినమైన, ధృడమైన ముందు భాగం మరియు శైలి, సౌకర్యం, పనితీరు యొక్క ఖచ్చితమైన సమ్మేళనంతో నూతన ఇన్నోవా క్రిస్టా ఖచ్చితంగా ఇన్నోవా వారసత్వంను ముందుకు తీసుకువెళ్లనుంది. ఈ వాహనంలో అత్యాఽధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించనున్నాయి. ఈ వాహనం అందించే మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాలను మా వినియోగదారులు ఆస్వాదించడంతో పాటుగా ప్రశంసించగలరనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.

ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ను 50వేల రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్‌ ఔట్‌లెట్లుతో పాటుగా www.toyotabharat.com.. వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్స్‌ G, GX, VX & ZX మరియు ఐదు రంగులు– సూపర్‌ వైట్‌, ఆటిట్యూడ్‌ బ్లాక్‌ మికా, అవంత్‌ గ్రేడ్‌ బ్రాంజ్‌ మెటాలిక్‌, ప్లాటినమ్‌ వైట్‌ పెరల్‌ మరియు సిల్వర్‌ మెటాలిక్‌లో లభ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News