Monday, December 23, 2024

ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత!

- Advertisement -
- Advertisement -

చైనా, పాకిస్థాన్ వంటి వరి ధాన్యం పండించే దేశాల్లో కరవు, వాతావరణ ప్రతికూలత కారణంగా ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. అమెరికా, యూరప్‌లలో ఉత్పత్తి కూడా తగ్గింది. ఉక్రెయిన్ యుద్ధం కూడా బియ్యం ఉత్పత్తి తగ్గటానికి ఒక కారణం. చైనాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలో గత 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత కరవు ఏర్పడింది. ప్రపంచంలో బియ్యం ఎక్కువగా ఎగుమతి చేసే భారత దేశంలో వరిసాగు తగ్గుతూ వస్తున్నది. 2021లో 267.05 హెక్టార్లలో వరి సేద్యం కాగా, 2022లో 231.59 లక్షల హెక్టార్లలో మాత్రమే సేద్యం జరిగింది. 35.46 లక్షల హెక్టార్లు సాగు తగ్గుదలగా ఉంది. ఇందుకు కారణం ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నష్టంగా మార్చి రైతుల భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలు అమలు జరపడమే. నల్ల సముద్రం ప్రాంతంలో వివాదం కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆకలి సంక్షోభంలో ఉన్నాయి.

ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదులు సృష్టించిన సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వలన సంపద కేంద్రీకరణ పెరిగి ధనిక, పేద వ్యత్యాసాలు తీవ్ర రూపం దాల్చింది. వెనుకబడిన దేశాల్లోని పాలక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం ఆహార పంటలను నియంత్రించడం వలన ఆహార ధాన్యాల కొరత ఏర్పడి, ప్రపంచ మార్కెట్‌లో వాటి ధరలు పెరగడం వలన పేదలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో ఆహారం కోసం ప్రజలు అత్యధికంగా ఉపయోగించేది బియ్యం. వ్యవసాయం కార్పొరేట్ల సంస్థల పరం కావడం వలన ఆహార ధాన్యం ఉత్పత్తులు తగ్గి బియ్యం కొరత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్నది. ఈ సంవత్సరం బియ్యం కొరత తీవ్ర రూపం దాల్చనుందని అనేక సంస్థలు తెలియజేస్తున్నాయి.

గడచిన 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రపంచ మార్కెట్‌లో బియ్యం తగ్గుదల ఏర్పడుతుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003- 04 సంవత్సరంలో 18.6 మిలియన్ టన్నుల బియ్యం కొరత ఏర్పడగా, 2022 -23లో 8.6 మిలియన్ టన్నుల లోటు నమోదు కానున్నది. బియ్యం కొరత వలన డిమాండ్ పెరిగి ధర ఆకాశాన్ని అంటుతుంది. ఫలితంగా ఆసియా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం 2022 ఫిబ్రవరి నాటికి సంవత్సరానికి ఆహార పంటల ధరలు 20% పెరిగాయి.
ఆసియా పసిఫిక్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ప్రపంచ మొత్తం మీద చూస్తే 90% బియ్యాన్ని ఈ ప్రాంతం ప్రజలే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలు పెరిగాయని ఫిచ్ సొల్యూసన్‌కి చెందిన ఛార్లెస్ హార్డ్ అనే కమోడిటీ ఎక్స్‌ఫర్ట్ చెప్పారు. ఇవే ధరలు వచ్చే సంవత్సరం కూడా కొనసాగుతాయని ఈ సంస్థ రూపొందించిన కంట్రీ రిస్క్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ రిపోర్టు హెచ్చరిక చేసింది.

చైనా, పాకిస్థాన్ వంటి వరి ధాన్యం పండించే దేశాల్లో కరవు, వాతావరణ ప్రతికూలత కారణంగా ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. అమెరికా, యూరప్‌లలో ఉత్పత్తి కూడా తగ్గింది. ఉక్రెయిన్ యుద్ధం కూడా బియ్యం ఉత్పత్తి తగ్గటానికి ఒక కారణం. చైనాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలో గత 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత కరవు ఏర్పడింది. ప్రపంచంలో బియ్యం ఎక్కువగా ఎగుమతి చేసే భారత దేశంలో వరిసాగు తగ్గుతూ వస్తున్నది. 2021లో 267.05 హెక్టార్లలో వరి సేద్యం కాగా, 2022లో 231.59 లక్షల హెక్టార్లలో మాత్రమే సేద్యం జరిగింది. 35.46 లక్షల హెక్టార్లు సాగు తగ్గుదలగా ఉంది. ఇందుకు కారణం ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నష్టంగా మార్చి రైతుల భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలు అమలు జరపడమే. నల్ల సముద్రం ప్రాంతంలో వివాదం కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆకలి సంక్షోభంలో ఉన్నాయి.

ప్రపంచంలో ఆకలి కేకలపై ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార పోగ్రామ్ (డబ్లుఎఫ్‌పి) 2022 నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 8.28 కోట్ల మంది ప్రజలు ఆకలితో నిద్రపోతున్నారు. 45 దేశాల్లో 50 లక్షల మంది కరవుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆహార కొరత ఎదుర్కొంటున్న జనాభా గత మూడు సంవత్సరాలతో పోలిస్తే 50 పెరిగి 34 కోట్ల 50 లక్షలకు పెరిగింది. మిడిల్ ఈస్ట్- నార్త్ ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత తీవ్ర సమస్యగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 2022 చివరి నాటికి మరిన్ని కరవులు సంభవిస్తాయని తెలిపింది. 2023లో ఆకలి కేకలు మరింత భయానకంగా ఉండవచ్చని ప్రపంచ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక హెచ్చరిక చేసింది.

భారత దేశంలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దేశ ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిని రైతులు పండిస్తున్నారు. గోదాముల్లో ఆహార ధాన్యాలకు కొదవలేదు. కరోనా కాలంలో గోదాముల్లోని బియ్యం కొంత మేర ఉపయోగపడ్డాయి. మోడీ ప్రభుత్వం ఆహార కొరతను పరిగణనలోకి తీసుకోకుండా వరి పంటను నియంత్రించి ఉత్పత్తులు ఆపాలని చూస్తున్నది. పాలకుల విధానాల ఫలితంగా దేశంలో ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టే నాటికి ఆకలి చావుల పట్టికలో భారత్ 57వ స్థానంలో ఉంటే, మోడీ పాలనలో 107 స్థానానికి వెళ్ళిందని ప్రపంచ ఆకలి చావుల పట్టిక వెల్లడిస్తున్నది. దక్షిణాసియా దేశాలన్నింటిలో చివరి స్థానంలో ఉంది.

యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార ప్రోగ్రామ్ సంస్థ, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలఫ్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించిన నివేదికలో 2018 -21 మధ్య కాలంలో భారత్‌లో 56 కోట్ల మంది (40) తీవ్ర ఆకలి కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సురక్షిత ఆహారం లేని వారిలో 37% భారత్‌లోనే ఉన్నారని ఆ నివేదిక పొందు పర్చింది. నేటికీ తిండి లేక ఎక్కడబడితే అక్కడ అడుక్కుంటున్నారు. ప్రతి రోజు 20 కోట్ల మంది ఆకలితో జీవిస్తున్నారని జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. పోషకాహార లోపంతో ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది బాలలు మరణిస్తున్నారు. మూడవ ప్రపంచ దేశాల పిల్లల ఎదుగుదల లోపంలో 20%తో భారత్ ముందు వరుసలో ఉంది.

భారత దేశంలో ఆహార ధాన్యాల సమృద్ధిగా ఉన్నాయని, ఎగుమతి చేయగలిగిన స్థితిలో ఉన్నామని మోడీ ప్రభుత్వం చెప్పే మాటలు మోసకారి తనంగా ఉన్నాయి. ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉంటే 20 కోట్లకు పైగా ఆకలితో ఎందుకు జీవిస్తున్నారు? ఆకలితో ఉన్న పేదలకు మోడీ ప్రభుత్వం ఆహార ధాన్యాలను ఎందుకు ఇవ్వటం లేదు? వారిని ప్రజలుగా గుర్తించటం లేదా! సమృద్ధిగా బియ్యం ఉంటే ఆంక్షలు ఎందుకు పెట్టారు. 2025 నాటికి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, 2030 నాటికల్లా జీరో హంగర్ ప్రపంచంగా ఉండాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయం ఊహాలోకంగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతూ, కొద్ది మంది వ్యక్తులు బడా కుబేరులుగా ఉండి, వర్గ వ్యత్యాసాలు తీవ్రమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చెప్పింది జరగాలంటే ప్రపంచలోని సంపదలు సమాజపరం చేయడంతో పాటు, కుబేరుల వద్ద ఉన్న ఆస్తులను, బడా భూస్వాముల, కార్పొరేట్ల వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకుని గ్రామీణ, పట్టణ పేదలకు పంపిణీ చేయాలి. ఐక్యరాజ్య సమితి ఈ పని చేయలేదు, చేయదు. దానికి ఆ శక్తి లేదు. అందువలన ఐక్యరాజ్య సమితి మాటలు నీటి మూటలుగానే ఉంటాయి. కార్మికులు, గ్రామీణ పేదలు పెటీ బూర్జువా వర్గం సమైక్య పోరాటం ద్వారా వ్యవస్థలను మార్చి సాధించుకోవాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News