Friday, November 22, 2024

రాహుల్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువునష్టం కేసులో దిగువ న్యాయస్థానం విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పును వేసవి సెలవుల అనంతరం ప్రకటించనున్నట్లు తెలిపింది. 52ఏళ్ల రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ హైకోర్టులో హాజరయ్యారు. అత్యవసర కేసుగా పరిగణించి పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వు లేదా తుది తీర్పును ప్రకటించాలని విన్నవించారు.

ఇరువర్గాల వాదన అనంతరం జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ మాట్లాడుతూ ఈ దశలో రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రకటించారు. రికార్డు, ప్రొసీడింగ్స్ అనుసరించి తుది తీర్పును వేసవి సెలవుల అనంతరం ప్రకటిస్తామని తెలిపారు. మే 8నుంచి జూన్ 3వరకూ వేసవి సెలవులు ఉండనున్నా యి. గుజరాత్ బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేష్ మోడీ తరఫున న్యాయవాది నిరుపమ్ సింగ్వీ వినతిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా 2019 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ‘మోడీ’ దొంగల ఇంటిపేరుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎంపి పదవిని కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News