Monday, December 23, 2024

అకాల వర్షాలు: రాలిన వడ్లకు ఎకరాకు 10వేలు ఆర్థిక సాయం..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసానిచ్చారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రాళ్లు కొట్టి, వాన కొట్టి గిట్ల మా ధాన్యం కారబ్ అయ్యిందని మంత్రికి అక్కడి మహిళా రైతులు గోడు వెలిబుచ్చారు. మీ బాధ తెలుసుకుని మీ ఆందోళన చెందకుండా అధైర్యపడొద్దని చెప్పేందుకు మీ వద్దకు వచ్చానని, ప్రభుత్వం సీఎం కేసీఆర్ మీకు అండగా ఉంటామని మహిళా రైతులను ఆత్మీయంగా పలకరిస్తూ భరోసానిచ్చారు. మీ తడిసిన ధాన్యం సైతం కొనమని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Also Read: హన్మకొండలో విషాదం.. అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News