Sunday, September 22, 2024

త్వరలో హైదరాబాద్‌లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయంలో పురపాలకశాఖపై మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. త్వరలో హైదరాబాద్ లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం చూడతామన్నారు. జిహెచ్ఎంసిలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లో మే ఆఖరున వార్డు కార్యాలయాలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. పాలన వికేంద్రీకరణ పౌరులకు వేగంగా పరిపాలన ఫలాలు అందించడమే తమ లక్ష్యమన్నారు.

Also Read: నిరసన వేదిక వద్ద మహిళా రెజ్లర్లకు పిటి ఉష మద్దతు

వార్డు కార్యాలయంలో అందుబాటులో 10 మంది అధికారులు ఉంటారని కెటిఆర్ పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్ ఛార్జిగా ఉంటారన్నారు. ప్రజలు సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు కార్యలయంలో సేవలు అందేలా చేస్తామని తెలిపారు. సిటిజన్ ఫ్రెండ్లీ జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాలు ఉండాలని కెటిఆర్ సూచించారు. ప్రతివార్డు ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం కావాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News