Saturday, December 21, 2024

రెండు లారీలు ఢీ.. డ్రైవర్లకు గాయాలు

- Advertisement -
- Advertisement -

మఠంపల్లి: రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్లకు గాయాలైన సంఘటన బుధవారం బక్కమంతులగూడెం సమీపంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి నుండి హుజూర్‌నగర్ వైపు వస్తున్న ఖాళీ లారీ కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా జిప్సం లోడుతో వెళ్తున్న లారీలు మండలంలోని బక్కమంతులగూడెం వద్ద గేదెలను తప్పించబోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని 108 లో హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News