Friday, September 20, 2024

ఈసెట్ గడువు మూడు రోజులు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న గడువును 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 8 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈసెట్ దరఖాస్తుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.900 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కన్వీనర్ తెలిపారు. ఆలస్య రుసుము రూ.2,500 చెల్లించి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ నెల 15న హాల్ టికెట్లు జారీ చేసి, 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ నిర్వహిస్తామని వెల్లడించారు. లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్, బీఎస్‌సీ మ్యాథ్స్ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీలో చేరేందుకు ఏటా ఈసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News