మన తెలంగాణ/హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొంది. 2023-24వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ గా నిధులు వచ్చాయి. గత నెల ఏప్రిల్‌లో పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,613 కో ట్ల నిధులు వ చ్చాయి. రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తలు, ఐ టీ, ఫార్మా, పారిశ్రామికవేత్తలు నిజాయితీగా పన్నులు చెల్లించడం తో ఖజానాకు ఇబ్బందులు లేకుండా ఆదాయం సమకూరుతోందని, అందుచేతనే జాతీయస్థాయిలో మార్మోగుతున్న ‘తెలంగాణ పథకాలు’కు నిధుల కొ రత సమ స్యే తలెత్తదని అధికారవర్గాలు అంటున్నాయి. గత ఆర్థ్ధి క సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు నిధుల సమీకరణ కు అనేక అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కేం ద్రం పై ఏమాత్రం ఆధారపడకుండా సొంతగానే నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, దళితబంధు, వ్య వసాయానికి 24/7 నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా, రైతు భీమా, కులవృత్తులకు ఆర్థిక స హాయం చేస్తున్న పథకాలన్నింటినీ కలిపి జాతీయస్థాయిలోని రైతు సంఘాల నాయకులు ము ద్దుగా “తెలంగాణ పథకాలు” అ ని నామకరణం చేశారని, ఇం తటి ప్రాచుర్యం పొందిన పథకాలకు నిధుల కొరత రానియ్యకుండా చూ సుకునే బాధ్యతను విజయవంతంగా నెరవేరుస్తామని ఆ అధికారులు అం టున్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఢిల్లీలోనూ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రా జకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు ఏక వా క్యంగా ‘తెలంగాణ పథకాలు’ అని పిలుస్తుంటే తమకు ఎంతో గర్వంగా ఉందని, ఆ పథకాలకు అవసరమైన ని ధుల ను సమకూర్చే బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని, అందుకే 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో అదనంగా రూ.30 వేల కోట్ల నిధులను సమకూ ర్చే పనిలో నిమగ్నమయ్యామని ఆ అధికారులు వివరించారు.
ఒకవైపు పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ పాలనకు నిధులు సరిపోవని, అందుకే ప్రత్యామ్నాయ మార్గా ల్లో మరో రూ.30 వేల కోట్లను సముపార్జించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తా ఏమిటో నిరూపిస్తామని, కేంద్ర ప్ర భుత్వంలోని కొందరు పెద్దలు ఎన్నిరకాలుగా వేధింపులకు గురిచేసినా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు మరింత ఉత్సాహంతో అమలుచేసి తీరుతామని ఆ అధికారులు ధీమాగా వివరించారు. గత ఏప్రిల్ నెలలో రూ.5,613 కోట్ల నిధులు పన్నుల రూపంలో ఖ జానాకు ఆదాయం వచ్చిందని వివరించారు. నిరుడు 2022 ఏప్రిల్ నెలలో ఖజానాకు 5312 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, అంటే గత ఏడాది ఏప్రిల్ కంటే ఈ ఏప్రిల్ నెలలో అదనంగా 10 శాతం ఆదాయం వచ్చిందని వివరించారు. అందులో ఎస్.జి.ఎస్.టి రూపంలో 1,820 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 1,662 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
మద్యం అమ్మకాల రూపంలో గత ఏప్రిల్ నెలలో కేవలం 1,050 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని, అదే మద్యం అమ్మకాల్లో గత ఏడాది (2022 ఏప్రిల్) ఏప్రిల్‌లో 1100 కోట్ల రూపాయలు వచ్చిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాల ఆదాయం తగ్గిందని తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై ఏప్రిల్ నెలలో 1,243 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వివరించారు. గత ఏడాది ఏప్రిల్‌లో 1,200 కోట్ల రూపాయలు రాగా ఏడాది 43 కోట్లు అదనంగా వచ్చిందని వివరించారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ విభాగం నుంచి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇదే గత ఏడాది ఏప్రిల్‌లో 900 కోట్ల రూపాయల వరకూ వచ్చిందని, మోటాల్ వాహనాల నుంచి ఏప్రిల్‌లో 500 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడాది (2022) ఏప్రిల్‌లో సుమారు 450 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వివరించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో చెప్పుకోతగిన రీతిలో గణనీయమైన ఆదాయం వస్తూనే ఉందని వివరించారు.
‘తెలంగాణ పథకాల’కు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నెలలో శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరిధిలోని భుములు, నిరర్ధక ఆస్తులు, అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీల పరిధిలోని అత్యంత ఖరీదైన భూములను అమ్మకానికి పెట్టి ఆ నిధులను రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, వ్యవసాయరంగానికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే వనరుల సమీకరణకు కసరత్తులు చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. హైదరాబాద్‌లోని జవహార్‌నగర్, కోకాపేట్‌లోని భూములను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా అజామాబాద్‌లోని పరిశ్రమల భూములను కూడా అమ్మాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించినట్లుగా వివరించారు.
దీనికితోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2010వ సంవత్సరాల్లో ఏపి హౌసింగ్ బోర్డుతో ప్రైవేట్ డవలపర్స్‌తో కలిసి జాయింట్ వెంచర్లు వేసి కొన్ని హౌపింగ్ ప్రాజెక్టులను చేపట్టిన విధంగానే ప్రస్తుతం ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యాలతో కలిసి ఇళ్ళ నిర్మాణాలను చేపట్టాలని, తద్వారా కూడా ఖజానాకు ఆదాయాన్ని రాబట్టుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని చీఫ్ సెక్రటరీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించినట్లుగా ఆ అధికారులు వివరించారు. అయితే ఈ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టాలా? వద్దా? అనే ప్రతిపాదనలకు ఇంకా ముఖ్యమంత్రి దగ్గర్నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదని, సీఎం ఆమోదిస్తే జాయింట్ వెంచర్ మౌసింగ్ ప్రాజెక్టులను చేపడతామని ఆ అధికారులు వివరించారు.
ఇలా అన్నిరకాల మార్గాల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచిగానీ, రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నుంచి కూడా తాము పెద్దగా సహకారం లభిస్తుందని ఆశించడంలేదని, కనీసం ప్రయత్నాలు కూడా చేయదలుచుకోలేదని, తెలంగాణకు కేంద్రం-ఆర్‌బిఐలు పూర్తిగా వ్యవతిరేకంగా వ్యవహరిస్తున్నాయని తేటతెల్లం అయిన తర్వాత సొంతకాళ్ళపైనే నిలదొక్కుకోవాలనే కసితో పనిచేస్తున్నామని ఆ అధికారులు వివరించారు. ఈ నేపధ్యంలో తప్పకుండా విజయం సాధిస్తామని, ‘తెలంగాణ పథకాల’కు ఎలాంటి లోటు రానివ్వమని ఆ అధికారులు భరోసాగా చెప్పారు.