రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలోడా జిల్లాలో వ్యాను-లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. పోలీస్ అధికారి అరుణ్ కుమార్ సాహూ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారని చిన్నారి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతులు దమ్‌త్రీ జిల్లాలోని సోరమ్‌భత్‌గామ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వివాహ వేడుక కోసం కంకేర్ జిల్లాలో మర్కటోలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య