Friday, December 20, 2024

విడాకుల వేడుక: తమిళ నటి ఫోటోషూట్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: నిశ్చితార్థం అయిన కొత్త జంట వివాహానికి ముందు ఫోటో షూట్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే విడాకులను కూడా వేడుక చేసుకుని ఫోటో షూట్ చేసుకున్న సందర్భం ఎక్కడా విని ఎరుగం. ఈ కొత్త సంప్రదాయానికి తమిళ నటి షాలిని నాంది పలికారు. తన విడాకుల వార్తను ప్రపంచానికి తెలియచేసేందుకు ఒక వినూత్న రీతిని ఎంచుకున్నారామె. ఫోటో షూట్ ద్వారా తన భర్తతో తెగతెంపులు చేసుకున్న విషయాన్ని ప్రకటించారు షాలిని. ఎరుపు రంగు గౌన్ ధరించి చేతిలో డైవోర్స్‌డ్ అని రాసి ఉన్న ఇంగ్లీష్ అక్షరాలతో ఆమె ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. తన పెళ్లినాటి ఫోటోను కూడా చింపుతూ తన భర్తతో విడిపోయానన్న సందేశాన్ని మరో ఫోటో ద్వారా ఇచ్చారామె. తన విడాకుల వేడుక ఫోటోషూట్‌ను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశారు షాలిని.

గొంతు విప్పి తన మనోభావాలను వ్యక్తం చేయలేని మహిళలకు విడాకులు తీసుకున్న ఒక మహిళ ఇస్తున్న సందేశమంటూ ఆమె కామెంట్ పోస్టు చేశారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి విఫల వివాహాన్ని తెంచుకోవడమే మంచిదని..మీ కోసం..మీ పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం అవసరమైతే అటువంటి నిర్ణయం తీసుకోక తప్పదని ఆమె తెలిపారు. విడాకులు వైఫల్యం కాదని, జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఇదోమంచి మలుపని షాలిని పేర్కొన్నారు. వివాహాన్ని వదులుకుని ఒంటరిగా జీవించడానికి చాలా ధైర్యం కావాలని, అలాంటి ధైర్యవంతులైన మహిళలకు ఈ సందేశాన్ని అంకితం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ ఫోటోషూట్ తాను సొంత ప్రచారం కోసం చేసుకుంటున్నది కాదని, తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇతర మహిళలకు సందేశం ఇవ్వడానికే తాను ఈ పోస్టు పెట్టానని ఆమె తెలిపారు. రియాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న షాలినికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. తన భర్త నుంచి ఎదురైన మానసిక, శారీరక హింస నుంచి తప్పించుకునేందుకే తాను విడాకులు తీసుకుంటున్నట్లు కూడా షాలిని తెలిపారు.

Also Read: వీర్యదానంతో 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News