Thursday, December 19, 2024

కర్నాటకలో విహెచ్‌పి, బజరంగ్ దళ్ నిరసన!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో అధికారంలోకి వస్తే మాత్రం బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి), బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. కొన్ని ప్రదేశాలలో అయితే వారు ‘హనుమాన్ చాలీసా’ కూడా పఠించారు.

బెంగళూరు, చిక్కబల్లాపురా, శ్రీరంగపట్న, మాండ్య, చిక్కమంగళూరు తదితర ప్రదేశాలలో నిరసనలు చేపట్టినట్లు విహెచ్‌పి వర్గాలు పేర్కొన్నాయి. ఇక శ్రీరంగపట్నలో అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపడమే కాకుండా, దానిని చెప్పులతో కొట్టారు. విహెచ్‌పితో సంబంధం ఉన్న బజరంగ్ దళ్ నాయకులు, హిందూ ధార్మిక నాయకులు ప్రజలకు ఓ వీడియో సందేశం ద్వారా గురువారం సాయంత్రం ‘హనుమాన్ చాలీసా’ పఠించేందుకు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మందిరానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ సముదాయాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వ్యక్తులపై,సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందన్నది ఇక్కడ గమనార్హం. కాంగ్రెస్ ‘ మేము చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతాము, దానిని ఉల్లంఘించే బజరంగ్ దళ్, పిఎఫ్‌ఐ లేక ఇతర సంస్థలు ఏవైనా సరే సామాజిక సముదాయాల మధ్య చిచ్చు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి సంస్థలను నిషేధిస్తాం’ అని తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విజయనగరం జిల్లాలోని హోస్పేట్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ‘ప్రభువు హనుమంతుడినే నిర్భందించేందుకు కాంగ్రెస్ తన మేనిఫెస్టో ద్వారా నిర్ణయించుకుంది. ఇంతకు మునుపు ప్రభు శ్రీరామ్‌నే వారు నిర్బంధించారు. ఇప్పుడు వారు ఎవరైతే ‘జై బజరంగ బలి’ అంటే వారిని నిర్బంధించాలని వారు నిర్ణయించుకున్నారు. మోడీ తన ప్రసంగంను జై బజరంగ బలి అని పలికే ప్రారంభించారు. ప్రసంగం చివరలో కూడా అదే పలికి ముగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News