హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సెంట్రల్ ఆఫీసును నేడు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన కార్యాలయంలోకి ప్రత్యేక పూజల క్రతువులతో పాటు ప్రవేశించారు. ఆయన వెంబడి బిఆర్‌ఎస్ మంత్రుల కూడా ఉన్నారు.
#Telangana Chief Minister and #BRSParty supremo K Chandrasekhar Rao inaugurated the party office 'BRS Bhavan' in New Delhi today, state Ministers, MPs, MLAs, leaders participated in the program and congratulated to KCR.#BRS #KCR #KTR #BRSpartyofficeDelhi#BharatRashtraSamithi https://t.co/AIBCDJoXv4 pic.twitter.com/bdR38Pwu8W
— Surya Reddy (@jsuryareddy) May 4, 2023
నాలుగు అంతస్తుల బిఆర్‌ఎస్ భవనం ‘వాస్తు శాస్త్ర’ పద్ధతిలో గొప్పగా నిర్మించారు. ఈ భవన నిర్మాణం గత ఏడాది మొదలయింది. బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ పార్టీగా విస్తరించాలన్న ధ్యేయంతో, ఢిల్లీలో కేంద్ర కార్యకలాపాలకు ఉపయోగపడే రీతిలో దీనిని నిర్మించారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత సీఎం శ్రీ కేసీఆర్.
కేసీఆర్ తో పాటు పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..BRS Party President, CM Sri KCR inaugurated the BRS Party Office in New Delhi.#brspartyofficedelhi #KCR #vemulaprashanthreddy pic.twitter.com/qlbuPnVW7c
— Vemula Prashanth Reddy (@VPR_BRS) May 4, 2023
దేశ సమగ్రాభివృద్ధి, రైతు పాలన తేవాలన్న లక్షంతో బిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కట్టిన కార్యాలయంతో ఇప్పుడు పార్టీ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిరంతరం బిఆర్‌ఎస్ భవన్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. బిఆర్‌ఎస్ భవన్‌ను 11000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఓ క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, జనరల్ సెక్రటరీలకు నాలుగు చాంబర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించారు. ఇక పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ చాంబర్, ఇతర చాంబర్, కాన్ఫరెన్స్ హాల్ వంటివి మొదటి అంతస్తులో నిర్మించారు. రెండో అంతస్తులో ప్రెసిడెంట్ సూట్‌తో పాటు మొత్తం 20 గదులు ఉన్నాయి. వాటిలో వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, ఇతర 18 గదులు ఉన్నాయి.
నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఎంఎల్‌సి కె.కవిత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయన కార్యదక్షత వల్లే దేశవ్యాప్తంగా 39 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రావతరణకు మద్దతునిచ్చాయన్నారు. కెసిఆర్ అనేక రాజకీయ కష్టనష్టాలు ఎదుర్కొని తెలంగాణను సాధించారన్నారు. ‘లోక్‌సభలో తొమ్మిది మంది ఎంపీలు, రాజ్యసభలో ఏడు మంది ఎంపీలు, తెలంగాణలో 105 మంది ఎంఎల్‌ఏలతో పార్టీ నేడు నేషనల్ పవర్‌హౌస్‌గా ఎదిగింది’ అన్నారు.
A party that began with the single goal of "Telangana state formation" achieved success despite difficult political conditions and with the overwhelming support of every citizen who believed in the idea of Telangana.
A man with a mission whose commitment inspired 39 political… pic.twitter.com/2Il4ryM5pZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 4, 2023