Friday, January 3, 2025

మే 6వ తేదీ వరకు టిఎస్‌ ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఈ విద్యా సంవత్సరం ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ఆడ్మిషన్లు చేయడానికి టిఎస్‌ఐసెట్ 2023 పరీక్షను నిర్వహించే బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. గురువారం సెట్ కన్వీనర్ వరలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొంటూ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు యూనివర్శిటీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఆలస్య రుసుము లేకుండా మే 6వ తేదీలోగా సమర్పించాలి.

రూ. 250ల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్ నమోదుకు మే 12 చివరితేదీ, అదే విధంగా రూ. 500 ఆలస్య రుసుముతో మే 18వ తేదీవరకు అవకాశం ఉందని,అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణను 12వ తేదీ నుంచి 15వ తేదీవరకు చేసుకోవచ్చని సూచించారు. మే 26, 27 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు 20 ఆన్‌లైన్ ప్రాంతీయ కేంద్రాల్లో 75 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. చివరి సంవత్సరం డిగ్రీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు కూడా టిఎస్‌ఐసెట్‌కు హాజరు కావడానికి అర్హులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News